క్రేజ్ పెంచుకుంటున్న అమీతుమీ

Monday,June 12,2017 - 06:33 by Z_CLU

మాన్ సూన్ సీజన్ లో పర్ ఫెక్ట్ హిల్లేరియస్ కంటెంట్ తో రిలీజైన అమీతుమీ సూపర్ హిట్ టాక్ తో అన్ని క్యాటగిరీస్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. జెంటిల్ మెన్ లాంటి బ్లాక్ బస్టర్ తరవాత, పెద్ద పెద్ద ఆర్భాటాలేవీ లేకుండా మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ క్లీన్ కామెడీ ఎంటర్ టైనర్, రోజు రోజుకి ఆడియెన్స్ ని పెంచుకునే పనిలోనే ఉంది.

 

 

అడివి శేష్, అవసరాల, వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ పర్ ఫెక్ట్ ఎంటర్ టైనర్ లో అదితి మ్యాకల్, ఈషా హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.