కార్తి

Wednesday,October 26,2016 - 05:04 by Z_CLU

కార్తీక్ శివ కుమార్ మే 25, 1977 లో జన్మించారు. ప్రముఖ తమిళ, తెలుగు నటుడు. కార్తి తమిళ కథానాయకుడు సూర్య తమ్ముడు. తొలుత ప్రముఖ దర్శకుడు మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన కార్తి 2007 లో ‘పరుత్తి వీరన్’ చిత్రం తో కథానాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రానికి గాను ఆ ఏడాది ఫిలిం ఫేర్ బెస్ట్ యాక్టర్ అందుకున్న కార్తి 2010 ‘ఆయిరతిల్ ఒరువన్’, ‘పైయ్యా’,’నాన్ మహాన్ అల్లా’ సినిమాలతో తమిళ్ కథానాయకుడిగా గుర్తింపు పొందాడు. కొన్ని అనువాద సినిమాలతో తెలుగు లో కథానాయకుడిగా గుర్తింపు అందుకున్నారు. ‘ఊపిరి’ చిత్రం లో నాగార్జున తో కలిసి నటించి టాలీవుడ్ లో స్ట్రైట్ హీరో గా గుర్తింపు అందుకున్నారు. ‘కాష్మోరా’ సినిమాతో తెలుగు తమిళ భాషల్లో భారీ వసూళ్లు సాధిస్తున్న కార్తి ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘కాట్రు వెళియిడై’ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు.

Born : 25 May 1977

సంబంధిత వార్తలు