ఆటో ఎక్కిన చినబాబు

Tuesday,July 17,2018 - 01:11 by Z_CLU

ఓవైపు ఆగకుండా కురుస్తున్న వర్షం, మరోవైపు ట్రాఫిక్. ప్రసాద్ ల్యాబ్స్ లో సక్సెస్ మీట్ ఉంది. మీడియా అంతా వెయిటింగ్. హీరో కార్తి ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడు. మాదాపూర్ లో అతడి కారు అంగుళం కూడా కదలని పరిస్థితి. దీంతో కారు దిగి ఆటో ఎక్కాడు కార్తి.

చినబాబు సక్సెస్ మీట్ లో పాల్గొనేందుకు ప్రసాద్ ల్యాబ్స్ కు వచ్చిన కార్తి, సడెన్ గా ఆటోలో దిగేసరికి అంతా షాకయ్యారు. కార్తితో పాటు నిర్మాత రవిందర్ రెడ్డి కూడా అదే ఆటోలో సక్సెస్ మీట్ ప్రొగ్రామ్ కు వచ్చారు. ఏదైతేనేం టైమ్ కు వచ్చేశారంతా.

2 రోజులుగా ఏపీ, తెలంగాణలో వివిధ పట్టణాల్లో ప్రచారం చేస్తున్న కార్తి, నిన్న హైదరాబాద్ చేరుకున్నాడు. చినబాబు సినిమాను సూపర్ హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు సక్సెస్ మీట్ ద్వారా థ్యాంక్స్ చెప్పాడు. ఈ సినిమాను ప్రత్యేకంగా మెచ్చుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు థ్యాంక్స్ చెప్పాడు కార్తి. ఈ సక్సెస్ మీట్ కు కార్తితో పాటు హీరోయిన్ సాయేషా కూడా వచ్చింది.