లవర్ బాయ్ గా కార్తీ...

Saturday,November 12,2016 - 05:39 by Z_CLU

ఇటీవలే భూత బేతాళుడి గా ‘కాష్మోరా’ సినిమాతో అందరిని అట్రాక్ట్ చేసిన కార్తీ ప్రస్తుతం లవర్ బాయ్ అవతారమెత్తాడు. మణిరత్నం దర్శకత్వం లో కార్తీ లవర్ బాయ్ గా నటిస్తున్న చిత్రం ‘కాట్రు వెలియడై’ . ఈ చిత్రం ‘డ్యూయెట్’ టైటిల్ తో తెలుగు లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ‘ఊపిరి’, ‘కాష్మోరా’ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న కార్తీ నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది మార్చ్ లో విడుదల కానుంది.

    యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ జోనర్ లో మణి రత్నం రూపొందిస్తున్న ఈ సినిమాకు ఎ.ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే చెన్నై, హైదరాబాద్, లేహ్ లడఖ్ ల లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం డిసెంబర్ లో ఒక ఫారిన్ షెడ్యూల్ తో మొత్తం షూటింగ్ పూర్తి చేసుకోనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు లో విడుదల చేయనున్నారు..