కార్తీ ‘ఖాకీ’ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Thursday,September 21,2017 - 10:20 by Z_CLU

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న కార్తీ ‘ఖాకీ’ మూవీ నవంబర్ 17 న రిలీజ్ కి రెడీ అవుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పోలీస్ బ్యాక్ డ్రాప్ లో అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి H.వినోత్ డైరెక్టర్.

 

ఈ సినిమా టీజర్ ఈ నెల 27 న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన సినిమా యూనిట్, ట్రైలర్ ని అక్టోబర్ 17 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది. అటు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను ఇంటరెస్టింగ్ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్న కార్తీ, ఈ సినిమాలో ఆంగ్రీ యంగ్ పోలీసాఫీసర్ గా ఎంటర్ టైన్ చేయనున్నాడు. ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి విడుదలకానుంది ఖాకి.