కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. కాల్షీట్ సంగతేంటి?

Wednesday,March 13,2019 - 07:11 by Z_CLU

కన్నడలో ఆమె స్టార్ హీరోయిన్. తెలుగులో కూడా స్టార్ స్టేటస్ అందుకుంది. ఇప్పుడు తమిళనాట ఫోకస్ పెట్టింది రష్మిక. మంచి బ్యానర్, హీరో, స్టోరీ దొరికితే కోలీవుడ్ ఎంట్రీ ఇద్దామని ఇన్నాళ్లూ వెయిట్ చేసింది. ఆమె వెయిటింగ్ ఎట్టకేలకు ఫలించింది. రష్మిక కోలీవుడ్ ఎంట్రీ షురూ అయింది.

డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై కొత్త సినిమా లాంఛ్ చేశాడు హీరో కార్తి. ఈ మూవీలో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. రష్మిక ఆశించిన అన్ని ఎలిమెంట్స్ ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈరోజు జరిగిన లాంఛింగ్ కు కూడా హాజరైంది.

అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో ఆమె ఈ సినిమాకు ఎలా కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేస్తుందనేది పెద్ద క్వశ్చన్. తెలుగులో డియర్ కామ్రేడ్ చేస్తోంది. నితిన్ సరసన భీష్మ సినిమాకు ఓకే చెప్పింది. మహేష్-అనీల్ రావిపూడి సినిమాకు కూడా దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టే. దీంతోపాటు కన్నడంలో పొగరు అనే మూవీ చేస్తోంది.

ఇంత బిజీగా ఉన్న టైమ్ లో కార్తి సినిమాకు ఆమె ఎలా టైమ్ కేటాయిస్తుందనేది డౌట్. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది.