కార్తీ ఇంటర్వ్యూ

Tuesday,July 10,2018 - 07:50 by Z_CLU

కార్తీ ‘చినబాబు’ ఈ నెల 13 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమా చుట్టూ, ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అవుతుంది. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ఈ సినిమాపై మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. దానికి తోడు సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్న హీరో కార్తి, ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు మీడియాతో షేర్ చేసుకున్నాడు. అవి మీకోసం… 

అదే ఇంట్రెస్టింగ్ పాయింట్…

సినిమాలో ఐదుగురు అక్కలకు తమ్ముడిలా నటించాను. ఒక్కొక్కరిది ఒక్కో క్యారెక్టరైజేషన్. ఇప్పటి వరకు అక్కా తమ్ముడి  సెంటిమెంట్ సినిమాలు వచ్చాయి. కానీ ఫస్ట్ టైమ్ ఇంతమంది అక్కల్లున్న తమ్ముడి స్టోరీ ఇదే ఫస్ట్ టైమ్.. అదే సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్…

పాజిటివ్ ఫార్మింగ్…

ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో పాటు ఈ సినిమాలో ఫార్మింగ్ గురించి చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. కమ్యూనిటీ ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు వ్యవసాయం ప్రొఫెషన్ గా ఎంచుకుంటే ఇంత ఎంజాయ్ మెంట్ ఉంటుందా అనిపిస్తుంది సినిమా చూస్తే…

 

గొడవ పడ్డా కామెడీ గానే…

సినిమాలో ప్రతి సీన్ లో కామెడీ ఉంటుంది. చివరికి గొడవ పడ్డా కామెడీ గానే ఉంటుంది. చాలా రియలిస్టిక్ సీన్స్ ఉంటాయి…

కంటతడి పెట్టేస్తారు…

సినిమాలో హ్యాప్పీ సీన్స్ కి కూడా ఇమోషనల్ గా కంటతడి పెట్టేస్తారు… ఒక్కో సీన్ కి అంత కనెక్టివిటీ ఉంటుంది.

అసలా అనుభవాలు వేరు…

పల్లెటూళ్ళలో ఉండే అనుభవాలు సిటీలో దొరకవు… నేనీ సినిమాలో ఇంట్లో ఎలుకలు పడుతుంటా… ఇలాంటి చాలా సీన్స్ సినిమాలో ఉంటాయి…

 

అదే రియాలిటీ…

అందరి లైఫ్ స్టైల్ వ్యవసాయం నుండే బిగిన్ అవుతుంది. అవకాశం దొరికినప్పుడల్లా వెళ్తూనే ఉండాలి. నా వైఫ్ పేరెంట్స్ ఫార్మర్సే. కాబట్టి హాలీడేస్ మొత్తం మా పాప అక్కడే స్పెండ్ చేస్తుంది. అందరం అలాగే ఆలోచించాలి. రూట్స్ మరిచిపోకూడదు…

అదే నా క్యారెక్టర్…

సినిమాలో మా ఫాదర్ కంప్లీట్ గా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నాపై పెడతారు… ఫ్యామిలీని ఒక్కటి చేయాలి…  5 గురు అక్కలు… వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, నా వల్ల క్రియేట్ అయ్యే ప్రాబ్లమ్స్… వాటన్నింటినీ సాల్వ్ చేయడం… అదే నా క్యారెక్టర్…

మన కల్చర్ ని గుర్తు చేస్తుంది…

కుటుంబాలు కలిసి ఉండటం ఎంత అవసరం అనేది ఈ సినిమాలో తెలుస్తుంది. మనం యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ప్రైవసీ కావాలి అని అందరికీ దూరంగా వెళ్తుంటాం.. కానీ ఒక వయసొచ్చాక అందరూ కావాలనిపిస్తుంది. అందుకే జాయింట్ ఫ్యామిలీ కల్చర్ మళ్ళీ రావాలి…

 

నెక్స్ట్ లవ్ ఎంటర్ టైనర్…

నా నెక్స్ట్ సినిమాలో లవర్ బాయ్ లా కనిపిస్తా.. రకుల్ ప్రీత్ హీరోయిన్.. అది స్టైలిష్ అండ్ న్యూ ఏజ్ సినిమా..

చాన్సెస్ ఉన్నాయి…

చాలా మంది ఖాకీ సీక్వెల్ గురించి అడుగుతున్నారు. నిజానికి కథను బట్టి సీక్వెల్ తీసే చాన్సెస్ ఉన్నాయి. చాలా రియల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కానీ.. డైరెక్టర్  చేద్దాం అంటే చేసేస్తాను… నిర్ణయం ఆయన చేతుల్లో ఉంది…

డైరెక్ట్ సినిమా…

‘ఊపిరి’ సక్సెస్ తరవాత మళ్ళీ డైరెక్ట్ తెలుగు సినిమా అంటే చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గ స్క్రిప్ట్ వస్తే అదృష్టం అనుకుంటాను.. తప్పకుండా చేస్తాను…