ఖైదీ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,October 28,2019 - 02:44 by Z_CLU

మొదటి రోజు వీక్ గా మొదలైన ఖైదీ సినిమా.. సూపర్ హిట్ టాక్ తో వీకెండ్ లో అందుకుంది. రివ్యూస్ అన్నీ పాజిటివ్ గా రావడం, మౌత్ టాక్ బాగా ఉండడంతో శని, ఆదివారాలు కార్తి సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. అలా ఫస్ట్ వీకెండ్ ఖైదీ సినిమా మెరిసింది.

మొదటి రోజు 30 లక్షల రూపాయల షేర్ కే పరిమితమైన ఖైదీ సినిమా, ఫస్ట్ వీకెండ్ (3 రోజులు) గడిచేసరికి తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా కోటి 76 లక్షల రూపాయల షేర్ కలెక్ట్ చేసింది. ఈ సినిమాతో తెలుగులో చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న సక్సెస్ ను అందుకోగలిగాడు ఖైదీ.

పండగ సీజన్ ముగిసినప్పటికీ, వీకెండ్ అయిపోయినప్పటికీ ఖైదీ సినిమాకు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సినిమాకు వినిపిస్తున్న మౌత్ టాక్ ఆ విధంగా ఉంది.

ఏపీ, నైజాం 3 రోజుల షేర్
నైజాం – రూ. 0.52 కోట్లు
సీడెడ్ – రూ. 0.33 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.24 కోట్లు
ఈస్ట్ – రూ. 0.12 కోట్లు
వెస్ట్ – రూ. 0.10 కోట్లు
గుంటూరు – రూ. 0.15 కోట్లు
నెల్లూరు – రూ. 0.08 కోట్లు
కృష్ణా – రూ. 0.22 కోట్లు