నాని Vs కార్తి.. ఎవరు ముందు ?

Tuesday,February 12,2019 - 12:11 by Z_CLU

తెలుగులో డిఫరెంట్ సినిమాలు తీసే అతికొద్ది మంది దర్శకుల్లో చంద్రశేఖర్ ఏలేటి ఒకడు. రీసెంట్ గా ఎలాంటి ప్రాజెక్టు ఎనౌన్స్ చేయని ఈ డైరక్టర్, ఇప్పుడు ఒకేసారి ఇద్దరు హీరోల్ని లైన్లో పెట్టాడు. వాళ్లే నాని, కార్తి.

ఆల్రెడీ నానికి ఓ కథ చెప్పి లాక్ చేసుకున్న ఈ డైరెక్టర్ నేచురల్ స్టార్ డేట్స్ కోసం వెయిటింగ్. మరోవైపు హీరో కార్తికి 2 కాన్సెప్టులు చెప్పాడు. వీటిలోంచి ఓ కాన్సెప్టును సెలక్ట్ చేసే పనిలోపడ్డాడు కార్తి. ఈ విషయాన్ని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఎనౌన్స్ చేశాడు.

ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నుండి ఓ సినిమాకు అడ్వాన్స్ అందుకున్న ఏలేటి, ఈ ఇద్దరు యంగ్ హీరోల్లో ఎవరితో సినిమా చేస్తాడో.. తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.