దొంగ వచ్చేస్తున్నాడు

Monday,December 02,2019 - 02:54 by Z_CLU

ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు దొంగ గా రానున్నాడు. ఈ చిత్రం లో కార్తీకి వదిన, సూర్య భార్య జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దొంగ’ పోస్టర్స్, టీజర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

‘దొంగ’ నుండి ఫస్ట్ సాంగ్ వీడియోని ఆదివారం విడుదల చేశారు. ‘రూపి రూపి’ అంటూ సాగే హుషారైన పాటని గోవా లో కలర్ఫుల్ గా పిక్చరైజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాయగా, రంజిత్ గోవింద్ పాడారు. గోవింద్ వసంత సంగీతం అందించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి డిసెంబ‌ర్ 20 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు.

యాంగ్రీ హీరో కార్తీ, జ్యోతిక, సత్యరాజ్‌, నిఖిల విమల్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌
సంగీతం: గోవింద్‌ వసంత
నిర్మాతలు: వయాకామ్‌ 18 స్టూడియోస్‌, సూరజ్‌ సదానా
దర్శకత్వం: జీతు జోసెఫ్‌