కార్తీ కరియర్ లోనే ఫస్ట్ టైమ్

Wednesday,July 11,2018 - 05:15 by Z_CLU

కార్తీ నటించిన చినబాబు ఈ నెల 13 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అల్టిమేట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫార్మర్ గా కనిపించనున్నాడు కార్తీ. ఇలాంటి సినిమా చేయడం కరియర్ లోనే ఫస్ట్ టైమ్ అని చెప్పుకున్న కార్తీ, ‘చినబాబు’ విషయంలో చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడు.

ఈ సినిమాలో 5 గురు అక్కలకు తమ్ముడిలా నటించిన కార్తీ, సినిమాలో చాలా రియలిస్టిక్ సిచ్యువేషన్స్  ఉండబోతున్నాయని చెప్పుకున్నాడు. ఇంట్లో ఎలుకలు పట్టడం దగ్గరి నుండి ఆర్గానిక్ ఫార్మింగ్ వరకు సినిమాలోని ప్రతి ఎలిమెంట్ న్యాచురల్ గా ఉండి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయని చెప్పుకున్నాడు.

 

ఆర్గానిక్ పద్దతిలో వ్యవసాయం చేసి నెలకు లక్ష రూపాయలకు పైగా సంపాదించే రైతులా కనిపించనున్న కార్తీ, ఈ సినిమా వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరు గర్వపడేలా ఉంటుందని చెప్పుకున్నాడు. దానికి తోడు సందర్భానుసారంగా ఉండబోయే యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాలో బోనస్ ఎలిమెంట్ కానున్నాయి.

అఖిల్ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయిన సాయేషా ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనుంది. పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చినబాబు’ D. ఇమ్మన్ మ్యూజిక్ కంపోజర్. 2D ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సూర్య నిర్మించిన ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.