కార్తీ ‘దేవ్’ ట్రైలర్ రివ్యూ

Friday,February 01,2019 - 01:15 by Z_CLU

వ్యాలెంటైన్ డే స్పెషల్ థియేటర్స్ లోకి రానుంది కార్తీ ‘దేవ్’ సినిమా. కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన ఈ సినిమాపై ఆడియెన్స్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయి ఉంది. అయితే సినిమాని మరింత వైడ్ గా రీచ్ అయ్యేలా  ప్రమోషన్స్ బిగిన్ చేసిన మేకర్స్, ఈ ట్రైలర్ తో ‘దేవ్’ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు.

2:10 నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ ని బట్టి సినిమాని దర్శకుడు రజత్ రవిశంకర్ అడ్వెంచర్స్, లవ్, యాక్షన్ ఇమోషన్స్ ని ఈక్వల్ గా బ్లెండ్ చేసి తెరకెక్కించాడనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాపై క్యూరియాసిటీ రేజ్ చేస్తున్నా, ట్రైలర్ లో డబ్బింగ్ మాత్రం ఏ మాత్రం ఇంప్రెసివ్ గా లేదు. ఒక్క కార్తీ వాయిస్ తప్ప, ప్రతీది మిస్ ఫైర్ అయిందనిపిస్తుంది.

ఇక కథ విషయానికి వస్తే కంప్లీట్ గా రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేసినా, రకుల్ ప్రీత్ సింగ్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ క్యారెక్టర్ చుట్టూ స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉండే చాన్సెస్ కనిపిస్తున్నాయి.

కార్తీ సినిమా అంటే కోలీవుడ్ లోనే కాదు, టాలీవుడ్ లో కూడా భారీ అంచనాలుంటాయి. ఈ సినిమా కూడా కార్తీ గత సినిమాల్లాగే 100% ఇంప్రెసివ్ క్వాలిటీతో రిలీజ్ అవుతుందనే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. హారిస్ జయరాజ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు.