'చెలియా' ఎట్రాక్షన్స్

Thursday,April 06,2017 - 02:13 by Z_CLU

కార్తీ, అదితి రావు జంటగా మణిరత్నం డైరెక్షన్ లో క్యూట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘చెలియా’. తెలుగు, తమిళ్ లో రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్స్ పై స్పెషల్ ఫోకస్…


‘చెలియా’ కి మణిరత్నం డైరెక్షన్ మెయిన్ ఎట్రాక్షన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి మణిరత్నం నుంచి ఓ లవ్ ఎంటర్టైనర్ వస్తుందంటే యూత్ థియేటర్స్ కి క్యూ కట్టడం కామన్. ‘రోజా’, ‘బొంబాయి’, ‘సఖి’, ‘ఓకే బంగారం’ వంటి లవ్ ఎంటర్టైనర్లు ఈ విషయాన్నీ రుజువు చేశాయి. పైగా స్టోరీలైన్ ఏంటనే విషయంపై సస్పెన్స్ ఉండడంతో చెలియా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది.


‘చెలియా’ కి మరో ఎట్రాక్షన్ కార్తీ.. ఇప్పటికే కొన్ని డబ్బింగ్ సినిమాలతో పాటు ‘ఊపిరి’ సినిమాతో నటుడిగా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన కార్తీ ఈ సినిమాలో 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్నాడు. ఒకటి లవర్ బాయ్ క్యారెక్టర్, ఇంకోటి మోస్ట్ పవర్ ఫుల్ క్యారెక్టర్.


ఈ సినిమాకు మరో ఎట్రాక్షన్ కథానాయిక అదితి రావు. ఇప్పటికే కొన్ని ఫొటోషూట్స్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ బ్యూటీ.. మణిరత్నం హీరోయిన్ గా చెలియాలో ఒదిగిపోయింది. కార్తీ తో అదితి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిపోయిందనే టాక్… చెలియాను టాప్ ప్లేస్ లో నిలబెట్టింది.


రెహ్మాన్ మ్యూజిక్ అంటే ఏ సినిమాకైనా స్పెషలే కదా. చెలియాకు కూడా అది వన్ ఆఫ్ ది మెయిన్ ఎట్రాక్షన్ అయిపోయింది. మరీ ముఖ్యంగా మణిరత్నం-రెహ్మాన్ కాంబినేషన్ లో వచ్చిన ప్రతీ ఆల్బమ్ హిట్. చెలియా సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ట్రయిలర్ లో రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.


చెలియాకి మరో ఎట్రక్షన్ సినిమాటోగ్రఫీ.. అందమైన లవ్ స్టోరీని అంతే అందంగా చూపించడం చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకు రవివర్మ సినిమాటోగ్రఫీ మరో హైలైట్ కానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో విజువల్ ఫీస్ట్ చూపించిన రవివర్మ… ఫుల్ లెంగ్త్ మూవీతో మరింత ఎట్రాక్ట్ చేయబోతున్నాడు.


లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎట్రాక్షన్ అంటే అది దిల్ రాజు బ్రాండ్. ఒక సినిమా పోస్టర్ పై దిల్ రాజు అనే బ్రాండ్ పడిందంటే ఇక ఆ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుతాయనడంలో సందేహమే లేదు. ఇప్పటికే మణిరత్నం రూపొందించిన ‘ఓకే బంగారం’కు సమర్పకుడిగా వ్యవహరించి తెలుగులో హిట్ అందుకున్న దిల్ రాజు… చెలియాకు కూడా ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. దిల్ రాజు బ్రాండ్ తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్లకు రప్పిస్తుంది.