ఇంటర్వ్యూ - కార్తీ (జపాన్)

Friday,November 03,2023 - 10:02 by Z_CLU

హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. జపాన్ ‘దీపావళి’ కానుకగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది. ఈ సందర్భంగా హీరో కార్తి జపాన్ విశేషాలని మీడియాతో పంచుకున్నారు.

 

జపాన్ ట్రూ స్టొరీ నా ? జపాన్ అనే టైటిల్ పెట్టడానికి కారణం ?

‘జపాన్’ ట్రూ స్టొరీ కాదు. కానీ వాస్తవ సంఘటనలు స్ఫూర్తి వుంటుంది. ఈ చిత్ర దర్శకుడు రాజు మురుగన్ రిపోర్ట్ నుంచి డైరెక్టర్ అయ్యారు. ఆయన చూసిన అనుభవాలు కూడా ఇందులో వున్నాయి. జోకర్ సినిమాకి ఆయనకు నేషనల్ అవార్డ్ వచ్చింది. జపాన్ లో మరో కొత్తకోణం ఆవిష్కరించారు. సినిమా చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఇదే అవుట్ అఫ్ ది బాక్స్ మూవీ అనిపించింది. ఇందులో ప్రతి సన్నివేశం చాలా కొత్తగా ఒరిజినల్ గా వుంటుంది. అయితే జపాన్ అనే పేరు ఎందుకు పెట్టామో సినిమా చూస్తే అర్ధమౌతుంది.

 

దర్శకుడు రాజు మురుగన్ చిత్రాలు ఇంటెన్స్ గా వుంటాయి.. ఇది భిన్నంగా కనిపిస్తుంది కదా?

జపాన్ లో కూడా సెటైర్ వుంది. మంచి డార్క్ కామెడీ పండింది. ఊపిరి సినిమాకి తమిళ వెర్షన్ డైలాగులు రాసింది ఆయనే. అప్పుడే ఆయన హ్యుమర్ చూసి షాక్ అయ్యాను. ఇందులో ఆ హ్యుమర్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇస్తుంది. చాలా రోజుల తర్వాత మాస్ తో పాటు హ్యుమర్ సెటైర్ వున్న డిఫరెంట్ రోల్ ఇందులో చేశాను.

 

జపాన్ కోసం కొత్తగా మేకోవర్ అయ్యారు .. డైలాగ్స్ కూడా చాలా పెక్యులర్ గా చెప్పారు కదా?

రాజ్ మురగన్ నా కోసం ఒక కథ రాశారు. అందులో ఒక పాత్ర నాకు చాలా నచ్చింది. ఆ పాత్రతో ఒక కథ చెప్పగలమా అని అడిగాను. అలా వచ్చిందే ‘జపాన్’. ఈ పాత్ర చాలా యూనిక్ గా వుంటుందని నాకు ముందే తెలుసు. ఈ పాత్ర కు కొత్త కార్తి కావాలి. దానికి తగ్గట్టే నన్ను నేను మార్చుకున్నాను. డబ్బింగ్ చెప్పినప్పుడు .. కార్తి వినిపిస్తున్నడు జపాన్ కావాలని అడిగారు దర్శకుడు. కొంతమంది పర్సనాలిటీకి వాళ్ళ వాయిస్ కి సంబంధం వుండదు. మనిషి దృడంగా వుంటారు కానీ వాయిస్ కాస్త లేతగా సన్నగా వుంటుంది. జపాన్ పాత్ర కోసం అలా ప్రయత్నించాం. అది అద్భుతంగా కుదిరింది. జపాన్ క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. ఈ పాత్ర చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.

 

జపాన్ యూనివర్సల్ సబ్జెక్ట్ నా?

జపాన్ అన్నీ ఫన్ ఎలిమెంట్స్ తో నేటి సమాజాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది. యూనివర్సల్ ఆడియన్స్ కి ప్రజెంట్ చేయడానికే చాలా ప్రతిభావంతులైన సాంకేతిక  నిపుణులతో పని చేశాం. ఎస్ రవివర్మన్ అద్భుతమైన విజువల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాగే జీవీ ప్రకాష్ మ్యూజిక్ తో మరో స్థాయికి తీసుకెళ్ళారు. విజువల్ ఎలా అయితే కొత్తగా వున్నాయో జీవీ కూడా చాలా కొత్తగా సంగీతం చేశారు.

 

మీ సినిమాల ఎంపిక ఎలా వుంటుంది ?

 సినిమాలోని మ్యాజిక్ నాకు చాలా ఇష్టం. ఏవో సమస్యలతో థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ ఓ రెండు గంటల పాటు అన్నీ మర్చిపోయి వేరే ప్రపంచంలో ప్రయాణించి ఆనందాన్ని పొందుతారు. అదే సినిమా మ్యాజిక్. ముందు ఇది సరిగ్గా నేర్చుకోవాలి. ఇది నాకు పెద్ద లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్. నా వరకూ నేను చేసిన ప్రతి సినిమా, కథ, పాత్ర డిఫరెంట్ గా ఉండే లాగా చూసుకుంటాను.   ప్రతిసారిఏదో డిఫరెంట్ గాచేయాలని ప్రయత్నిస్తాను. అది నాకు వర్క్ అవుట్ అవుతుంది.

 

బ్యాక్ టు బ్యాక్ అన్నపూర్ణ స్టూడియోస్ తో చేయడం ఎలా అనిపిస్తుంది ?

అన్నపూర్ణ స్టూడియోస్ తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా వుంది. అన్నపూర్ణ స్టూడియోస్ రావడంతో మరింత బలం చేకూరింది.

 

ఖైదీ 2 ఎప్పుడు ? రోలెక్స్ లో పాత్ర ఎలా వుంటుంది.

దాని కోసం నేనూ వెయిటింగ్ ( నవ్వుతూ). చర్చలు జరుగుతున్నాయి.  రోలెక్స్ గురించి ప్రేక్షకుల్లో చాలా అంచనాలు వున్నాయి. దీని గురించి అన్నయ్య (సూర్య), దర్శకుడు లోకేష్ కనకరాజ్ ని అడగాలి( నవ్వుతూ)

 

సీక్వెల్స్ అంటే భయం వుంటుంది కదా..  సీక్వెల్స్ ని మీరేలా చూస్తారు ?

ఒక బలమైన పాత్ర, బ్యాక్ స్టొరీ వున్నప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లవచ్చు. ఖైదీ, సర్దార్ కి అది జరిగింది కాబట్టి ముందుకు తీసుకెళ్తున్నారు.

 

జపాన్ కి సీక్వెల్ వుంటుందా ?

జపాన్ చాలా బలమైన, ఆసక్తికరమైన పాత్ర.. దీనికి సీక్వెల్, ప్రీక్వెల్ ఎదో ఒకటివుండాలని క్లైమాక్స్ కి ముందే దర్శకుడితో చెప్పాను. జపాన్ పాత్రని మళ్ళీ చేయాలని వుంది.

 

కొత్తగా చేస్తున్న చిత్రాలు ?

సూదుకవ్వం చిత్ర దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే 96 దర్శకుడు ప్రేమ్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాను. ఈ రెండు దేనికవే ప్రత్యేకం. అలాగే ఖైదీ 2, సర్దార్ 2 కూడా వున్నాయి.