కార్తి సినిమాకు పేరు మారింది...

Thursday,January 26,2017 - 02:02 by Z_CLU

మణిరత్నం దర్శకత్వంలో కార్తి ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అదితి రావు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు సమర్పిస్తున్నాడు. తెలుగులో ఈ సినిమాకు డ్యూయట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే తాజాగా ఆ సినిమా పేరు మార్చారు. డ్యూయట్ బదులు చెలియా అనే మరో టైటిల్ ను ఫిక్స్ చేశారు. త్వరలోనే చెలియా టైటిల్ తో కొత్త పోస్టర్లు, స్టిల్స్ విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటివరకు మణిరత్నం తీసిన రొమాంటిక్ సినిమాలన్నీ హిట్ అయ్యాయు. సో… చెలియా మూవీ కూడా కచ్చితంగా హిట్ అవుతుందనే సెంటిమెంట్ వినిపిస్తోంది.

cheliyaa-poster