కార్తీ ‘దొంగ’ ట్రైలర్ రివ్యూ...

Tuesday,December 10,2019 - 05:48 by Z_CLU

రీసెంట్ గా కార్తీ ‘ఖైదీ’ సక్సెస్ తరవాత మళ్ళీ రిలీజ్ రెడీ అవుతున్న సినిమా ‘దొంగ’. ఈ సినిమాలో జ్యోతిక, కార్తీ అక్కా తమ్ముడిగా నటించారు. అదే ఈ సినిమాకి ఫస్ట్ ఎవర్ ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఈ రోజు రిలీజైన ఈ ట్రైలర్ సినిమాలోని ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ ని రివీల్ చేసింది.

ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్ళిపోయిన శర్వా, మళ్ళీ తిరిగి వస్తాడు. అంతవరకు సంతోషమే. కానీ వచ్చిన వాడు శర్వానా..? కాదా…? ఈ క్వశ్చన్ రేజ్ చేస్తుంది ట్రైలర్. దానికి తోడు జ్యోతిక సీరియస్ అండ్ మెచ్యూర్డ్ క్యారెక్టర్ సినిమాకి మరింత గ్రేస్ ఆడ్ చేస్తుందనిపిస్తుంది.

ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు ‘దొంగ’ లో పొలిటికల్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయని ట్రైలర్ లో ఒకచోట జ్యోతిక చెప్పే డైలాగ్ ని బట్టి తెలుస్తుంది. ఇకపోతే ‘నేనే శర్వా’ అనుకుంటూ ఇంటికి వచ్చిన ‘దొంగ’ నిజానికి తప్పిపోయిన జ్యోతిక రియల్ బ్రదరా..? కాదా..? అనేది పక్కన పెడితే, సినిమా అయిపోయే లోపు ఆ ఫ్యామిలీకి స్ట్రాంగెస్ట్ పిల్లర్ లా మారతాడన్నదే ఈ సినిమా కథ అని తెలుస్తుంది.

ఇంతకీ ఈ ‘దొంగ’, ఆ శర్వా ఒక్కరేనా..? కాదా..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే అయినా, కార్తీ నుండి మరో బ్లాక్ బస్టర్ వస్తుందనే స్థాయిలో ఈ ట్రైలర్ క్యూరియాసిటీ జెనెరేట్ చేస్తుంది. జీతూ జోసెఫ్ ఈ సినిమాకి డైరెక్టర్. గోవింద్ వసంత మ్యూజిక్ కంపోజ్ చేశాడు. డిసెంబర్ 20 న ఈ సినిమా రిలీజవుతుంది.