Sardar2 సీక్వెల్ తో రాబోతున్న కార్తి !

Wednesday,October 26,2022 - 12:15 by Z_CLU

Makers Announced ‘Sardar2’ , Mission begins soon !

దీపావళి స్పెషల్ గా ఆడియన్స్ ముందుకొచ్చిన కార్తి ‘సర్దార్’ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. వాటర్ మాఫియా నేపథ్యంతో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తమిళ్ తో పాటు తెలుగులోనూ సినిమా మంచి వసూళ్ళు రాబడుతుంది. ముఖ్యంగా కార్తి డ్యుయల్ రోల్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. సర్దార్ అనే స్పై ఏజెంట్ గా తన నటనతో మెస్మరైజ్ చేశాడు కార్తి. అయితే రిలీజ్ కి ముందు మేకర్స్ ఈ సినిమా సీక్వెల్ పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

తాజాగా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి సీక్వెల్ ను ఎనౌన్స్ చేసేశారు. విజయ్ ను పోలీస్ డిపార్ట్ మెంట్ నుండి తొలగిస్తూ అతన్ని స్పై ఏజెంట్ గా తీసుకొని ఒక మిషన్ అప్పగించడం తో సర్దార్ సీక్వెల్ మొదలు కానుందని వీడియో ద్వారా ప్రకటించారు మేకర్స్. ప్రెజెంట్ సర్దార్ 2 ఎనౌన్స్ మెంట్ వీడియో సోషల్ మీడియా ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ సీక్వెల్ పై అంచనాలు పెంచేస్తుంది.

త్వరలోనే ఖైదీ సీక్వెల్ కి రెడీ అవుతున్న కార్తి సర్దార్ సీక్వెల్ కూడా మొదలు పెట్టనున్నాడు. మరి సర్దార్ 2 తో కార్తి -మిత్రన్ మరోసారి మేజిక్ రిపీట్ చేసి ఏ రేంజ్ హిట్ అందుకుంటారో చూడాలి.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics