షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కార్తీ కొత్త సినిమా

Wednesday,December 26,2018 - 03:02 by Z_CLU

ఒక్క ఫస్ట్ లుక్ తోనే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది కార్తీ కొత్త సినిమా ‘దేవ్’. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని  ఫుల్ ఫోకస్ పోస్ట్ ప్రొడక్షన్ పై పెట్టిన మేకర్స్, సంక్రాంతి నుండి సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు. డిసెంబర్  29 న  ఆడియో రిలీజ్ చేసి ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేయాలని ఫిక్సయింది సినిమా యూనిట్.

యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘దేవ్’ సినిమాని చెన్నై, హైదరాబాద్, ముంబై తో పాటు హిమాలయాల్లో తెరకెక్కించారు మేకర్స్. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

రజత్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ‘దేవ్’ సినిమా. కార్తి సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నికీ గర్లాని కూడా కూడా నటించింది. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజర్. S. లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.