కార్తీ ‘దేవ్’ ఆడియో రిలీజ్ డేట్

Thursday,January 10,2019 - 06:26 by Z_CLU

ఫిబ్రవరి 14 న రిలీజవుతుంది కార్తీ ‘దేవ్’ సినిమా. ఇమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మేకర్స్, ఈ సినిమా ఆడియోని జనవరి 14 న రిలీజ్ చేస్తున్నారు.

గతంలో ‘ఖాకీ’ సినిమాతో బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడీ అనిపించుకున్న కార్తీ, రకుల్ ఈ సినిమాలో మరోసారి అదే తరహా మ్యాజిక్ జెనెరేట్ చేయనున్నారు. కార్తీ కూడా తన లేటెస్ట్ మూవీ ‘చినబాబు’ సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత క్లోజ్ అయ్యాడు. ఈ సారి ‘దేవ్’ కూడా అదే తరహాలో ఎంటర్టైన్ చేస్తుందనే వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి.

ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. రజత్ రవిశంకర్ ఈ సినిమాకి డైరెక్టర్. S. లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజర్.