రేపే కార్తీ ‘చినబాబు’ గ్రాండ్ రిలీజ్

Thursday,July 12,2018 - 03:38 by Z_CLU

కార్తీ నటించిన ‘చినబాబు’ ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా పాండిరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. కరియర్ లోనే ఫస్ట్ టైమ్ ఫార్మర్ లా నటించిన కార్తీ, ఈ సినిమా బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

ఈ సినిమాలో కార్తీ 5 గురు అక్కలకు తమ్ముడిలా కనిపిస్తాడు. ఇప్పటి వరకు యాక్షన్ హీరోలా, లవర్ బాయ్ లా మెస్మరైజ్ చేసిన కార్తీ, ఈ 5 అక్కల ఇమోషన్స్ మధ్య, సరికొత్తగా కనిపించనున్నాడు. దానికి తోడు వ్యవసాయం చేస్తూ నెలకు లక్ష రూపాయలు సంపాదించే తెలివైన రైతులా కార్తీ క్యారెక్టరైజేషన్, సినిమాలో హైలెటెడ్ ఎలిమెంట్ కానుంది.

సినిమా ట్రైలర్ లో మరీ ఎక్కువగా ఎలివేట్ కాకపోయినా, సోషల్ మీడియాలో రిలీజైన స్టిల్స్ ని బట్టి కార్తీ, సాయేషా కెమిస్ట్రీ సినిమాలో మరింత ఫ్రెస్ నెస్ ఆడ్ చేస్తుంది. ఫ్యామిలీని ఒక్కటి చేయాలనే నాన్న కోరిక కోరిక తీర్చే కొడుకులా కార్తీ, ఆ కుటుంబాన్ని కలిపేందుకు చేసే ప్రయత్నాలు సినిమాలో కావాల్సినంత హ్యూమర్ ని జెనెరేట్ చేయనున్నాయి.

ఈ సినిమాకి కార్తీ హీరో అయినా, సక్సెస్ గ్యారంటీ అని నమ్మి సినిమాని నిర్మించింది సూర్య. ఈ ఇద్దరు అన్న దమ్ముల కాంబినేషన్ లో సినిమా అనగానే న్యాచురల్ గానే ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు ఫిల్మ్ మేకర్స్ కాన్ఫిడెన్స్ చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.