కార్తీ ‘దేవ్’ టీజర్ రిలీజ్

Monday,November 05,2018 - 02:24 by Z_CLU

కార్తీ ‘దేవ్’ టీజర్ రిలీజయింది. ‘ఖాకీ’ సినిమా తరవాత రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో మరోసారి కార్తీతో జత కట్టింది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా, రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ లుక్ తో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేసింది. మరీ ముఖ్యంగా కార్తీ లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇప్పుడు అదే రూట్ లో మరింత స్టైలిష్ ఫార్మాట్ లో ఈ టీజర్ ని ప్రెజెంట్ చేశారు మేకర్స్.

టీజర్ చూసి సినిమా స్టోరీలైన్ గెస్ చేయడం కష్టమే కానీ, ఈ 1:15 సెకన్ల టీజర్ లో సినిమా థీమ్ ని ఎలివేట్ చేశారు మేకర్స్. ‘ఈ లోకంలో బ్రతకడానికి ఎన్నో దారులున్నాయి..’ అంటూ టీజర్ తో పాటే బిగిన్ అయ్యే డైలాగ్, ఆ తర్వాత ఉండే విజువల్స్ సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ ఇస్తున్నాయి.

నలుగురికీ నచ్చాలనే టార్గెట్ తో, ఎలాగోలా బ్రతికేయాలనే ఆలోచనతో కాకుండా లైఫ్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా బ్రతికేయాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా దేవ్. ఇకపోతే కార్తీ, రకుల్ కెమిస్ట్రీ కూడా సినిమాకి మరో ప్లస్ అవ్వడం గ్యారంటీ అనిపిస్తుంది.

రజత్ రవి శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ‘దేవ్’ సినిమా. హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని S. లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.