వీకెండ్ రిలీజెస్

Wednesday,July 11,2018 - 12:53 by Z_CLU

లాస్ట్ వీక్ రిలీజైన 3 సినిమాలు డిఫెరెంట్ జోనర్ లోనే… తేజ్ I love u లవ్ ఎంటర్ టైనర్ అయితే గోపీచంద్ ‘పంతం’ మెసేజ్ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఈ 2 సినిమాలు బాక్సాఫీస్  దగ్గర వాటికవే స్పెషల్ అనిపించుకున్నాయి. ఈ 2 సినిమాలతో పాటు రిలీజ్ అయిన ఫాంటసీ ఎంటర్ టైనర్ ‘దివ్యమణి’ కూడా కొన్ని సెంటర్ లలో ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడం లో సక్సెస్ అయింది.

ఈ 3 సినిమాల హవా తగ్గకముందే ఈ వీకెండ్ మరో 3 సినిమాలు బాక్సాఫీస్ బరిలోకి దిగడానికి రెడీగా ఉన్నాయి. వాటి వివరాలు…

 

చినబాబు : కార్తీ, సాయేషా జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చినబాబు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఆడియెన్స్ లో భారీ అంచనాలున్నాయి. సత్యరాజ్ ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు.  పాండిరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన చినబాబు రిలీజ్ డేట్ జూలై 13.

విజేత : మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్, మాళవిక జంటగా నటించిన ఇమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ విజేత. ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ సిల్వర్ స్క్రీన్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. జస్ట్ టైటిల్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయిన ఫిల్మ్ మేకర్స్, సినిమా ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. రాకేశ్ శశి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 12 న రిలీజవుతుంది.

 

RX 100 : కార్తికేయ, పాయల్ రాజ్ పూత్ జంటగా నటించిన మాస్ ఎంటర్ టైనర్ RX 100. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ట్రైలర్స్ తో ఎట్రాక్ట్ చేస్తుంది. అజయ్ భూపతి ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమా జూలై 12 న రిలీజవుతుంది.