కార్తీ ఇంటర్వ్యూ...

Monday,November 13,2017 - 01:44 by Z_CLU

కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఖాకీ’ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 17 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సందర్భంగా కార్తీ చేసిన ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ మీకోసం…

అదే ఈ సినిమాలో డిఫెరెన్స్….

ఖాకీ సినిమా 1995 to 2005 పోలీస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పటి  వరకు  పోలీస్ బ్యాక్ డ్రాప్  లో చాలా సినిమాలు వచ్చాయి కానీ, ఈ సినిమా వేరు… ఎవరైనా ఒక మర్డర్ జరిగిందంటే, ఎందుకు జరిగింది.? ఎలా జరిగింది.? ఎప్పుడు జరిగింది..? నుండి బిగిన్ అయి, చివరికి క్రిమినల్ దొరికితే కేస్ క్లోజ్ అయిపోతుంది. కానీ ఇది అలా కాదు, ఒక మర్డర్ జరిగితే, అసలెందుకు జరిగింది..? అని రీసర్చ్ చేసి, ప్రాబ్లమ్ బిగినింగ్ వరకు వెళ్ళి ఆ కేస్ మూలాల్ని తెలుసుకోవడం…

రియలిస్టిక్ స్టోరీ….

ఇది పోలీస్ డిపార్ట్ మెంట్ లో నిజంగా జరిగిన స్టోరీ… ఒక కేసు విషయంలో పోలీస్ డిపార్ట్ మెంట్ దాదాపు 10 ఇయర్స్ పని చేసింది. ఒక స్టేట్ లో జరిగిన ఇష్యూ విషయంలో, తక్కిన స్టేట్స్ నుండి సపోర్ట్ తీసుకుంటూ, ఎలా ఆ ప్రాబ్లమ్ ఎండ్ వరకు రీచ్ అయ్యారు అనేదే ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్…

 

కమర్షియల్ ఎంటర్ టైనర్

ఈ సినిమా కంప్లీట్ కమర్షియల్ ఎంటర్ టైనర్…   స్టోరీ రియల్ స్టోరీ అయినా, మేం దీన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే  కన్వే చేశాం.. ఆడియెన్స్ ఎక్కడా బోర్ కొట్టకుండా చేజింగ్ ఎలిమెంట్స్ దగ్గర నుండి ప్రతీది ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేసుకున్నాం…

పాటలుంటాయి కానీ…

సినిమాలో లవ్ స్టోరీ కూడా ఇన్ డెప్త్ గా ఉంటుంది. 3 సాంగ్స్ కూడా ఉంటాయి. కాకపోతే సాంగ్స్ కూడా ఏదో పెట్టాలి కాబట్టి పెట్టారు అనేలా కాకుండా, స్టోరీతో పాటు ఇన్వాల్వ్ అయి ఉంటాయి…

క్యూట్ లవ్ స్టోరీ…

సినిమాలో రకుల్ ని చాలా కొత్తగా చూస్తారు… అప్పుడే కొత్తగా పెళ్ళైన కపుల్ మధ్య ఉండే రిలేషన్ షిప్, చాలా క్యూట్ గా ఉంటుంది…

ట్రైనింగ్ తీసుకున్నాం…

సినిమా సెట్స్ పైకి రాకముందే నేను, నాతో పాటు ఉండేవాళ్ళు కూడా టఫ్ ట్రేనింగ్ తీసుకున్నాం, ఎందుకంటే పోలీస్ లా కనబడాలి అంటే ఫిజిక్ ఒకటే కాదు, ఆటిట్యూడ్ ఉండాలి, సో చాలా హోమ్ వర్క్ చేశాకే సెట్స్ పైకి వచ్చాం…

రెస్పెక్ట్ పెరిగింది…

ఈ సినిమా తరవాత పోలీసులంటే ఉండే రెస్పెక్ట్ ఇంకా పెరిగింది, ఎంత పెరిగిందంటే ఇంతకు ముందు ఒక పోలీస్ ఎండలో నిలబడి ఉంటే పెద్దగా పట్టించుకునే వాణ్ణి కాదు, ఎక్కడ పడితే అక్కడ నిలబడి తింటుంటే పెద్దగా రియాక్ట్ అయ్యే వాణ్ణి కాదు. కానీ ఇప్పుడర్థమవుతుంది… డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్లకు అది తప్ప ఇంకో ధ్యాస ఉండదు.. విమెన్ కాప్ కి కావాల్సినన్నీ ఫెసిలిటీస్ ఉండవు… అదంతా ఆలోచిస్తే చాల బాధ అనిపిస్తుంది…

ఫెయిల్యూర్స్ లేకపోతే ముందుకు వెళ్ళలేం…

ఫెయిల్యూర్స్ ఎప్పుడు కూడా మంచి ఎక్స్ పీరియన్సెస్ నే ఇస్తాయి.  సక్సెస్ వస్తే మంచిదే కానీ ఫెయిల్యూర్ వస్తే నాలెడ్జ్ వస్తుంది. కేర్ పెరుగుతుంది.. నా దృష్టిలో ఫెయిల్యూర్స్ లేకపోతే అసలు ముందుకు వెళ్ళలేం…

నెక్స్ట్ ప్రాజెక్ట్స్…

ఈ సినిమా తరవాత విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాను, దాంతో పాటు రకుల్ తో మరో లవ్ స్టోరీ ఉంటుంది…