సూర్య చేతుల మీదుగా కార్తీ కొత్త సినిమా ఫస్ట్ లుక్

Thursday,October 25,2018 - 07:14 by Z_CLU

కార్తీ ‘దేవ్’ సినిమా ఫస్ట్ లుక్ రిలీజయింది. సూర్య చేతుల మీదుగా రిలీజైన ఈ ఫస్ట్ లుక్ లో చాలా స్టైలిష్ గా ఉన్నాడు కార్తీ. చేతిలో హెల్మెట్ తో,వెనకాల రేసింగ్ బైక్ తో  రిలీజైన ఈ పోస్టర్ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది.

పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘ఖాకీ’ సినిమా తరవాత ఈ జోడీ మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్  చేయనుంది.  ప్రకాష్ రాజ్ తో పాటు రమ్యకృష్ణ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

హారిస్ జయరాజ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. S. లక్ష్మణ్ కుమార్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పిన్స్ పిక్చర్స్, లైట్ హౌజ్ మూవీ మేకర్స్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. రజత్ రవిశంకర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.