సల్మాన్ ఖాన్

Monday,July 18,2016 - 10:35 by Z_CLU

అబ్దుల్ రషీద్ సలీమ్ సల్మాన్ ఖాన్(సల్మాన్ ఖాన్) డిసెంబర్ 27, 1965 లో ఇండోర్ మధ్యప్రదేశ్ లో జన్మించారు. 1988 లో ‘బివి హోతో ఐసి’ సినిమాతో నటుడిగా పరిచయమైన సల్మాన్ ఖాన్ 1989 లో ‘మైనే ప్యార్ కియా’ సినిమాతో కథానాయకుడిగా గుర్తింపు తో పాటు ఘన విజయం అందుకొని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్  ‘ఫిలింఫెర్’ అవార్డు కు గాను నామినేట్ అయ్యారు. అప్పటి నుండి కథానాయకుడిగా వరుసగా సినిమాలతో సందడి చేసిన సల్మాన్ ఖాన్ ‘హం అప్కే హైన్ కౌన్’, ‘కరణ్-అర్జున్’,’బివి నంబర్ 1′,’కుచ్ కుచ్ హోత హాయ్’ వంటి  సినిమాలతో సూపర్ హిట్స్  అందుకొని స్టార్ హీరో గా ఎదిగారు. కొన్ని వరుస అపజల తరువాత ‘వాంటెడ్’ సినిమాతో ఘన విజయం అందుకొని తొలి సారి గా 100 కోట్ల క్లబ్ లో చేరారు సల్మాన్ ఖాన్. ఈ సినిమా తరువాత ‘బాడీ గార్డ్’, ‘ఏక్త టైగర్’,’కిక్’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. ‘భజ్రంగీ భాయ్ జాన్’ సినిమాతో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకొని భారీ వసూళ్లు సాంధించి ఇండియన్ మార్కెట్ లో మంచి స్థానం సంపాదించుకున్నారు. ఈ సినిమా తరువాత ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్న సల్మాన్ ఖాన్ తాజాగా  ‘సుల్తాన్’ తో మరో గ్రాండ్ హిట్ అందుకొని బాక్సాఫీస్ వద్ద  భారీ వసూళ్లు రాబట్టారు. ప్రతి ఏడాది ఈద్ సందర్బంగా తన సినిమాను విడుదల చేస్తూ ఘన విజయాలు అందుకుంటున్నసల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘ట్యూబ్ లైట్’ అనే సినిమాలో నటిస్తున్నారు.

Born : 27 December 1965