కార్తీ ‘చినబాబు’ సూపర్ హిట్

Friday,July 13,2018 - 12:21 by Z_CLU

కార్తీ ఏ సినిమా చేసినా తప్పకుండా సమ్ థింగ్ స్పెషల్ ఉంటుంది. యాక్షన్ సినిమా చేసినా, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చేసినా దేనికదే స్పెషల్… ఇప్పుడు అదే వరసలో పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘చినబాబు’ ఈ రోజు గ్రాండ్ గా రిలీజయింది. ఐదుగురు అక్కలకు తమ్ముడిలా నటించిన కార్తీ, ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు.

అటు ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ ఇమోషన్స్ తో పాటు కార్తీ మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా, అన్ని క్యాటగిరీస్ ని మెస్మరైజ్ చేస్తుంది. ఫస్ట్ షో కంప్లీట్ అవ్వకముందే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్  చేస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ తో చినబాబు ట్రెండ్ అవుతుంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో  పక్కా ఫార్మర్ లా కనిపిస్తున్న కార్తీ పర్ఫామెన్స్ కి అవుట్ స్టాండింగ్ రెస్పాన్స్ వస్తుంది.

కార్తీ సరసన సాయేషా హీరోయన్ గా నటిస్తున్న ఈ సినిమా పాండిరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కింది. సత్యరాజ్, భానుప్రియ కీ రోల్స్ ప్లే చేసిన ఈ సినిమాకి D. ఇమ్మన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.