దేవ్ నుంచి ఖైదీగా మారడం కష్టమైంది

Tuesday,October 29,2019 - 01:12 by Z_CLU

ఖైదీ సక్సెస్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు కార్తి. తన సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పాడు. ఖైదీ కోసం చాలా కష్టపడ్డానని చెప్పిన ఈ హీరో, డిల్లీ పాత్ర కోసం తనను తాను మార్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డానని అంటున్నాడు.

“దేవ్ సినిమా చేసినప్పుడు ఆ పాత్రకు న్యాయం చేయాలనిపించింది. అందుకే అప్పుడు ది బెస్ట్ ఇచ్చాను. ఇక ఖైదీ విషయానికొచ్చేసరికి, మళ్లీ నన్ను నేను మార్చుకోవాల్సి వచ్చింది. దేవ్ కోసం దాదాపు 6 కిలోలు తగ్గాను. ఖైదీ కోసం మళ్లీ పెరగాల్సి వచ్చింది. ఇలా క్యారెక్టర్ కోసం ఎంతోకొంత కష్టపడాలి. అప్పుడే తృప్తి.”

అవార్డుల కోసం ఖైదీ చేయలేదంటున్నాడు కార్తి. తను ఏ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అందులో ఎంటర్ టైన్ మెంట్ ఉందో లేదో చెక్ చేస్తానని, ఖైదీ అనేది హీరోయిజం ఉన్న సినిమా అని నమ్మి చేశానంటున్నాడు.

“అవార్డుల కోసం ఖైదీ చేయలేదు. ప్రజల్ని ఎంటర్ టైన్ చేయడం ఇంపార్టెంట్. ఆ కోణంలోనే ఏ కథనైనా ఆలోచిస్తాను. వినోదానికి ఏం కావాలో అదే చేస్తున్నాను. కానీ ఖాకి, ఖైదీ లాంటి సినిమాల విషయంలో కాస్త లైన్ పక్కకు వెళ్తాను. ఎందుకంటే వినోదంతో పాటు నాకు పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉంటుంది కదా. ఇలాంటి కథలు వదులుకోవాలని అనుకోను.”

ఓ సినిమాకు ఓకే చెప్పేముందు.. అందులో పాత్ర తనకు ఛాలెంజింగ్ గా ఉందా లేదా.. ఆ కథను ప్రేక్షకుడు ఎలా ఫీల్ అవుతాడనే రెండు ఎలిమెంట్స్ ను దృష్టిలో పెట్టుకుంటానంటున్నాడు కార్తి. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నానని, ఇకపై కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతానంటున్నాడు.