మణిరత్నం 'చెలియా' రిలీజ్ డేట్

Friday,January 27,2017 - 05:08 by Z_CLU

మణిరత్నం చెలియకి రిలీజ్ డేట్ ఫిక్సయింది. షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సినిమా యూనిట్, మొన్నటి వరకు మార్చి 24 న రిలీజ్ చేద్దామనుకున్నా, చివరికి ఏప్రిల్ 7 న రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు.

అల్టిమేట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కార్తీ సరికొత్త లుక్ తో ఇప్పటికే ఎట్రాక్ట్ చేస్తున్నాడు. మరోసారి తన మార్క్ లవ్ ఎంటర్ టైనర్ తో మ్యాజిక్ చేయడానికి రెడీ మణిరత్నం మరోసారి రొమాంటిక్ మ్యాజిక్ ని స్ప్రెడ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

కార్తీ సరసన అదితి రావు హైదరి నటించిన ఈ సినిమాకి A.R. రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. తెలుగులో ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు.