పైలట్ ట్రయినింగ్ తీసుకున్న కార్తి

Tuesday,March 21,2017 - 05:05 by Z_CLU

క్యారెక్టర్ కోసం ఎలాంటి మేకోవర్ కైనా రెడీ అవుతాడు కార్తి. యుగానికొక్కడు, కాష్మోరా సినిమాలు చూస్తే కార్తి మూవీ సెలక్షన్ ఏంటో అర్థమౌతుంది. ఇలాంటి హీరో మణిరత్నం డైరక్షన్ లో సినిమా చేస్తున్నప్పుడు.. కేవలం అది మణిరత్నం సినిమా కాబట్టే కార్తి ఒప్పుకొని ఉంటాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ అంతకుమించి ఎక్సయిట్ మెంట్ ఉంది కాబట్టే కార్తి ఒప్పుకున్నాడు.

మణిరత్నం-కార్తి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా చెలియా. ఈ మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో మాట్లాడిన కార్తి, సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పుకొచ్చాడు. మణిరత్నం దర్శకత్వంతో పాటు యుద్ధ విమాన పైలట్ పాత్ర కావడంతోనే చెలియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పిన కార్తి.. ఆ క్యారెక్టర్ కోసం ఫైటర్ పైలట్ ట్రయినింగ్ కూడా తీసుకున్నాడట.

చెలియ సినిమాలో నటించడం ఒక డిఫెరెంట్ జర్నీగా ఫీల్ అయిన కార్తీ, ఈ సినిమా డెఫ్ఫినేట్ గా తన కరియర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మణిరత్నం స్టయిల్ లో ఇంటెన్స్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చెలియా ఏప్రిల్ 7 న రిలీజవుతుంది.