శేఖర్ కమ్ముల

Wednesday,June 21,2017 - 05:12 by Z_CLU

శేఖర్ కమ్ముల ప్రముఖ దర్శకుడు. డాల్లర్ డ్రీం అనే ఇండిపెండెంట్ ఫిలింతో దర్శకుడిగా గుర్తింపు అందుకున్న శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ కు పరిచయం అయ్యాడు. ఈ సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి శేఖర్ కమ్ముల కి దర్శకుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత గోదావరి అనే సినిమాను రూపొందించి మరో సూపర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల కొందరు కొత్త నటీ నటులతో ‘హ్యాపీ డేస్’ సినిమాను రూపొందించి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరవాత ‘ఆవకాయ్ బిర్యానీ’,’లీడర్’,’లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’,’అనామిక’,’ఫిదా’ సినిమాలకు దర్శకత్వం వహించాడు.

సంబంధిత వార్తలు