Interview - శేఖర్ కమ్ముల (లవ్ స్టోరీ మూవీ)

Monday,September 20,2021 - 04:29 by Z_CLU

 లవ్ స్టోరీ సినిమాలో 2 ఇష్యూస్ టచ్ చేశాం. వివక్ష ఎదుర్కొనే వర్గం నుంచి వచ్చిన అబ్బాయి, మహిళా వివక్ష ఎదుర్కొనే అమ్మాయి.. ఇలా 2 కీలకమైన ఇష్యూష్ ను డిస్కస్ చేశాం. సాధారణంగా లవ్ స్టోరీలో ప్రేమలు, ఇగోలు, కుటుంబ గొడవలు ఉంటాయి. కానీ ఇందులో సమాజంలో ఉన్న 2 ఇష్యూస్ ను టచ్ చేశాం.

⇒ కుల వివక్ష ఆంధ్రాలో ఎక్కువ, తెలంగాణలో తక్కువ లాంటివి లేవు. ప్రతి రాష్ట్రంలో ఉంది. వివక్షలో ఎక్కువ తక్కువలు ఉండవు. ఆ దెబ్బ తగిలినోడికి ఆ బాధ తెలుస్తుంది. ఆ అంశాన్ని లవ్ స్టోరీలో టచ్ చేశాం.

⇒ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకో 30 రోజుల్లో పూర్తవుతుందనగా కరోనా వచ్చింది. అన్నీ ఆగిపోయాయి. దాదాపు ఏడాది గ్యాప్ వచ్చేసింది. షూటింగ్స్ మొదలైన తర్వాత మేమే ఫస్ట్ సెట్స్ పైకి వచ్చాం. యూనిట్ అందరికీ
ఇన్సూరెన్స్ చేయించాం. మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు ఇచ్చాం. కొవిడ్ ప్రొటోకాల్ వల్ల బడ్జెట్ 3 రెట్లు పెరిగింది. అంతా ఓకే అనుకున్న టైమ్ కు సెకెండ్ వేవ్ వచ్చింది. దీంతో చాలా లేట్ అయిపోయింది.

sekhar kammula

⇒ ఇండస్ట్రీ అంతా లవ్ స్టోరీ కోసం ఎదురుచూస్తోంది. ఫ్యామిలీస్ వచ్చే సినిమా కాబట్టి, మా సినిమా రిజల్ట్ కోసం అంతా వెయిటింగ్. ఈ సినిమాకు ఫ్యామిలీస్ వస్తే మార్కెట్ సెట్ అయినట్టే. అందుకే అందరూ ఎదురుచూస్తున్నారు. మాపై ఈ ఒత్తిడి కూడా ఉంది.

⇒ చైతూతో తెలంగాణ యాస చెప్పించడానికి చాలా కష్టపడ్డాం. చైతూ కష్టపడ్డాడు, మేం కూడా కష్టపడ్డాం. ఎంత కష్టపడినా యాస విషయంలో విమర్శలు వస్తాయనే విషయం తెలుసు. అందుకే మ్యాగ్జిమమ్ కష్టపడ్డాం. ప్రతి పదాన్ని జాగ్రత్తగా డబ్బింగ్ చెప్పించాం. మేనరిజమ్స్ కూడా మార్చడానికి కష్టపడ్డాం. కచ్చితంగా కొత్త చైతన్యను చూస్తారు.

sekhar kammula

⇒ నాగచైతన్య ఇందులో జుంబా డాన్సర్ గా కనిపించాడు. ఇదేదో మెయిన్ స్ట్రీమ్ డాన్స్ కాదు. ఫిట్ నెస్ కోసం చేసే డాన్స్. దీనికోసం నాగచైతన్య చాలా కష్టపడ్డాడు. తను డాన్స్ లో వీక్ అని తనే ఒప్పుకొని మరీ డాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డాడు.

⇒ సాయిపల్లవి మంచి పెర్ఫార్మెర్. అందుకే లవ్ స్టోరీలో కూడా ఆమెనే రిపీట్ చేశాను. అంతకుమించి పెద్దగా లెక్కలేం లేవు. లవ్ స్టోరీలో సాయిపల్లవి పాత్ర చాలా క్లిష్టమైనది. ఆమె చేసిన మౌనిక పాత్ర చాలా బాగా వచ్చింది. ఫిదాలో భానుమతికి, మౌనిక పాత్రకు ఎలాంటి సంబంధం ఉండదు.

⇒ పవన్, రెహ్మాన్ స్టూడెంట్. నాకు చాలా రోజులుగా తెలుసు. మన లోకల్ కుర్రాడు. మ్యూజిక్ కొంచెం ఫ్రెష్ గా అనిపించి ట్రై చేశాను. చాలా బాగా చేశాడు. మంచి సాంగ్స్ ఇచ్చాడు. ఆర్ఆర్ కూడా అద్భుతంగా చేశాడు. ఈ కరోనా టైమ్ లో మా సినిమా లైమ్ లైట్లో ఉండడానికి కారణం లవ్ స్టోరీ మ్యూజిక్.

⇒ ఫిదాలో ప్రేక్షకులకు ఎక్కువ ఇష్టమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. లవ్ స్టోరీలో ఓ కష్టం ఉంది. ఆ కష్టం అనే ఎలిమెంట్ దాదాపు అందరికీ కనెక్ట్ అవుతుంది. ఆ ఎమోషన్ అందరికీ తగులుతుంది. ట్రయిలర్ లో కావాలనే నేను ఎక్కువ స్టోరీ చెప్పాను. ఎందుకంటే, ఫిదా తర్వాత ఆడియన్స్ చాలా అంచనాలు పెంచుకున్నారు. ఆ
అంచనాల్ని సెట్ చేయడం కోసం ట్రయిలర్ లో కాస్త ఎక్కువే చెప్పాను.

⇒ అమీర్ ఖాన్ గారు ముంబయిలో స్పెషల్ షో వేయించుకొని చూస్తానన్నారు. వీలైతే హైదరాబాద్ తీసుకొచ్చి షో చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక చిరంజీవి గారు 2-3 సార్లు చూస్తానన్నారు. ఆయన అంత ఓన్ చేసుకోవడం నాకు కళ్లల్లో నీరు తిరిగాయి. వీళ్లిద్దరి వల్ల మా సినిమా రేంజ్ మరింత పెరిగింది.

sekhar kammula

⇒ ప్రేమ్ నగర్ రిలీజైన రోజునే లవ్ స్టోరీ కూడా రిలీజ్ అవుతోంది. నాగార్జున చెప్పిన వరకు ఈ విషయం మాకు తెలియదు. ఆ సినిమాతో లవ్ స్టోరీని పోల్చడం చాలా గర్వంగా ఉంది. అయితే ప్రేమ్ నగర్ సాధించిన విజయంలో మేం 20శాతం సాధించినా చాలు.

⇒ నెక్ట్స్ మూవీ ధనుష్ తో చేస్తున్నాను. అది ప్రేమకథ కాదు. థ్రిల్లర్ జానర్ సినిమా. తెలుగు, తమిళ, హిందీలో చేస్తున్నాం. ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మూవీ ట్రై చేస్తున్నాను. వర్కవుట్ అవుతుందనే అనుకుంటున్నాను. ఈ కథకు ధనుష్ కరెక్ట్.

⇒ లీడర్ సీక్వెల్ తప్పకుండా చేస్తాను. రానాతోనే సీక్వెల్ ఉంటుంది. కథగా సీక్వెల్ కాదు, క్యారెక్టర్స్ తోనే సీక్వెల్ చేస్తాను. లీడర్ లో ఓపెన్ ఎండ్ ఉంటుంది. లీడర్-2 కూడా అలానే ఓపెన్ గా స్టార్ట్ అవుతుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics