షూటింగ్ అప్ డేట్స్

Sunday,November 25,2018 - 01:05 by Z_CLU

ఆర్.ఆర్.ఆర్

జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో భారీ ఫైట్ షూట్ చేస్తున్నారు. ఈ సినిమా ఇటివలే ప్రారంభమైన ఈ షెడ్యూల్ దాదాపు డిసెంబర్ 10 వరకూ జరగనుందని సమాచారం.


విన‌య విధేయ రామ

రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న `విన‌య విధేయ రామ‌` టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. డిసెంబ‌ర్ 10 నుండి హైద‌రాబాద్‌లో భారీ సెట్‌లో ఓ పాటను చిత్రీక‌రించ‌బోతున్నారు. కియ‌రా అద్వాని హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాలో ప్ర‌శాంత్‌, ఆర్య‌న్ రాజేశ్‌, స్నేహ, వివేక్ ఒబెరాయ్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. డి.పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై దాన‌య్య డి.వి.వి నిర్మిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుద‌ల కానుంది.

నాగ చైతన్య – సమంత మూవీ 

నాగ చైతన్య -సమంత కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేసుకుంది. కొన్ని రోజులుగా వైజాగ్ లో జ‌రుగుతున్న షెడ్యూల్ ను ఇటివలే ఫినిష్ చేసారు . న‌వంబ‌ర్ 26 నుంచి హైద‌రాబాద్ లో కొత్త షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు 40 శాతం షూటింగ్ పూర్తైపోయింది. దివ్యాంశ కౌశిక్ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రొమాంటిక్ డ్రామాకు గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు.. షైన్ స్క్రీన్ బ్యాన‌ర్ లో సాహు గ‌ర‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


శేఖర్ కమ్ముల సినిమా

కొత్త వాళ్ళతో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించబోతున్న సినిమా డిసెంబర్ నుండి సెట్స్ పైకి రానుంది. డిసెంబర్ మొదటి వారంలో హైదరాబాద్ లో మొదటి షెడ్యుల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే నటీ నటుల వివరాలు తెలియజేయనున్నారు.

 

కళ్యాణ్ రామ్ -గుహన్ మూవీ

గుహన్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఐదు రోజుల ప్యాచ్ వర్క్ మినహా టోటల్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసారు యూనిట్. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నివేత థామస్ , శాలిని పాండే హీరోయిన్స్ నటిస్తున్నారు. మహేష్ కోనేరు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది.


ఏ.బి.సి.డీ

అల్లు శిరీష్ హీరోగా సంజీవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఏబిసిడీ’ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం హీరో హీరోయిన్స్ తో పాటు మరికొందరు నటులపై కొన్ని కీలక మైన సీన్స్ షూట్ చేస్తున్నారు. మరో 15 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యుల్ తర్వాత అమెరికాలో మరో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మధురా శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 8న థియేటర్స్ లోకి రానుంది.

దొరసాని 

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అవుతున్న ‘దొరసాని’ సినిమా నల్గొండ షెడ్యుల్ పూర్తి చేసుకుంది. ఈ షెడ్యుల్ లో ఆనంద్ , శివాత్మిక రాజశేఖర్ లపై కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసారు. డిసెంబర్ లో వరంగల్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. మహేందర్ దర్శకత్వంలో పిరియాడిక్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమాను సురేష్ బాబు, మధురా శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తున్నారు.