స్టార్ హీరోల ఆలోచన మారాలి

Tuesday,July 18,2017 - 06:04 by Z_CLU

శేఖర్ కమ్ముల ఫిదా ఈ నెల 21 న రిలీజ్ కి రెడీగా ఉంది. ట్రెండ్ సెట్టింగ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లాంటి శేఖర్ కమ్ముల సినిమా సక్సెస్ గ్యారంటీ అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. న్యాచురల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఫిదా రీసెంట్ టైమ్ లో రిలీజ్ ఫార్ములా సినిమాలతో పోలిస్తే చాలా డిఫెరెంట్ గా ఉంటుందని చెప్తున్నాడు.

హీరోని బట్టి సినిమా కాకుండా స్క్రిప్ట్ ని బట్టే సినిమాలు అని బిలీవ్ చేసే శేఖర్ కమ్ముల, స్టార్ హీరోస్ రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా, ప్రేక్షకుల అభిరుచిని మైండ్ లో పెట్టుకుని సినిమాలు చేస్తే ఫ్రెష్ కంటెంట్ తో సినిమాలు తెరకెక్కుతాయని, అప్పుడే సక్సెస్ రేషియో పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

 ఇక ఫిదా విషయానికి వస్తే శక్తి మ్యూజిక్ తో పాటు రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రేలర్ ఆడియెన్స్ లో సినిమా పట్ల ఇంట్రెస్ట్ ని జేనేరేట్ చేస్తున్నాయి. ఈ సినిమాకి దిల్ రాజు ప్రొడ్యూసర్.