Sekhar Kammula - సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

Tuesday,September 21,2021 - 02:07 by Z_CLU

సినిమా సినిమాకు గ్యాప్ తీసుకుంటూ వస్తున్న దర్శకుడు శేఖర్ కమ్ముల మరో మూడు రోజుల్లో ‘లవ్ స్టోరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న శేఖర్ కమ్ముల తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘లీడర్’ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చాడు. రానాను హీరోగా పరిచయం చేస్తూ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లీడర్’ థియేటర్స్ అనుకున్నత పెర్ఫాం చేయలేదు. కానీ ఆ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

sekhar kammula

తెలుగులో వచ్చిన పొలిటికల్ సినిమాల లిస్టు చెప్పుకుంటే అందులో ‘లీడర్’ సినిమా ప్రస్తావన కచ్చితంగా ఉంటుంది. జనాల సమస్యలు , లంచగొండితనం , కుల రాజకీయాలపై శేఖర్ కమ్ముల తీసిన ఆ సినిమాకి ఎప్పటి నుండి సీక్వెల్ కోరుకుంటున్నారు సినిమా అభిమానులు. గతంలో శేఖర్ కమ్ముల కూడా ఆ సినిమా సీక్వెల్ ఉంటుందని చెప్పుకున్నాడు. తాజాగా ఇంటర్వ్యూ లో కూడా మళ్ళీ ఆ సీక్వెల్ ప్రస్తావన వచ్చింది. దానికి బదులు చెప్తూ ‘లీడర్ 2’ కచ్చితంగా ఉంటుందని రానాతోనే మళ్ళీ ఆ సినిమా చేస్తానని తెలిపాడు శేఖర్ కమ్ముల. అయితే అది లీడర్ కి కొనసాగింపు లా కాకుండా కొత్త కథతో తీయలనుకుంటున్నానని తెలిపాడు.

leader-rana-zeecinemalu1

నెక్స్ట్ కోలీవుడ్ స్టార్ ధనుష్ తో పాన్ ఇండియా సినిమా తీస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఆ సినిమాను థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కించనున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఆ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల ‘లీడర్ 2’ సినిమాను పట్టాలేక్కిస్తాడేమో చూడాలి. మరి శేఖర్ కమ్ముల ఈసారి ఆ సీక్వెల్ లో ఎలాంటి విషయాలు చర్చించబోతున్నాడో అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics