#LoveStory తాత సెంటిమెంట్ తో మనవడు !

Tuesday,September 14,2021 - 03:40 by Z_CLU

ఒక్కో సారి కొన్ని అనుకోని సెంటిమెంట్స్ కలిసొస్తాయి. ఇప్పుడు అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కి కూడా అలాంటి ఓ సూపర్ సెంటిమెంట్ కలిసొచ్చేలా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య , సాయి పల్లవి నటించిన ‘లవ్ స్టోరి’ వాయిదా పడుతూ ఎట్టకేలకు సెప్టెంబర్  24న థియేటర్స్ లోకి వస్తుంది.

అయితే ఈ డేట్ చైతు కి సెంటిమెంట్ గా మారింది. అవును యాబై ఏళ్ల క్రితం అదే ఇదే రోజు అక్కినేని నాగేశ్వరావుగారు నటించిన ‘ప్రేమ నగర్’ విడుదలైంది. ఆ సినిమా భారీ వసూళ్ళు రాబట్టి ఘన విజయం నమోదు చేసుకుంది. ఆ టైంలో నష్టాల్లో ఉన్న  సురేష్ ప్రొడక్షన్ కి సినిమా టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. 13 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని రీ రిలీజ్ లో కూడా నిర్మాత రామానాయుడు గారికి మంచి  వసూళ్లు తెచ్చిపెట్టింది.

LoveStory-Premnagar-zeecinemalu

ఇప్పుడు అదే డేట్ కి చైతు ‘లవ్ స్టోరి’ థియేటర్స్ లో వస్తుండటంతో అక్కినేని ఫ్యాన్స్ కూడా సెంటిమెంట్ గా ఫీలవుతున్నారు. తాజాగా నాగార్జున కూడా ప్రేమ నగర్ రిలీజ్ డేట్ కి వస్తున్న లవ్ స్టోరి రెండు పోస్టర్స్ ని కలిపి పోస్ట్ చేసి చైతు కి టీం విషెస్ తెలిపాడు. పైగా ఈ ఏడాదితో ప్రేమ నగర్ రిలీజై యాబై ఏళ్ళు అవుతుండటం కూడా విశేషం. ఆ సెలెబ్రేషన్స్ ‘లవ్ స్టోరి’ విడుదలయ్యే థియేటర్స్ లో జరుపుకోనున్నారు అక్కినేని ఫ్యాన్స్. మరి ఈ డేట్ సెంటిమెంట్ వర్కౌట్ అయి అక్కినేని నాగేశ్వరావు గారి కెరీర్ లో ఓ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘ప్రేమ నగర్’ లా చైతు కి కూడా ‘లవ్ స్టోరి’ మంచి విజయం అందిస్తుందా ? చూడాలి.

 
– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics