'ఫిదా'లో తెలంగాణ స్టయిల్ సాంగ్.. మరికొన్ని గంటల్లో రిలీజ్

Friday,June 30,2017 - 11:16 by Z_CLU

దశలవారీగా సాంగ్స్ రిలీజ్ చేయడం అనే ట్రెండ్ ఎప్పుడో మొదలైంది. ఆ ట్రెండ్ ను ఫాలో అవుతూ.. ఫిదా సాంగ్స్ ను ఈరోజు నుంచి మినిమం గ్యాప్ లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఫిదా ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాబోతోంది. వచ్చిందే అనే లిరిక్స్ తో సాగే ఈ పాట తెలంగాణ స్టయిల్ లో సాగే సంగీత్ సాంగ్ అని తెలుస్తోంది.

వరుణ్ తేజ్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు ఫిదా సినిమాలో. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కంప్లీట్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది ఈ మూవీ. మలయాళీ బ్యూటీ సాయిపల్లవి ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమౌతోంది. టీజర్, ట్రయిలర్ తో ఇప్పటికే ఎట్రాక్ట్ చేసిన ఈ కూల్ మూవీ.. ఇవాళ్టి నుంచి పాటలతో సందడి చేయనుంది. శక్తికాంత్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.