'లీడర్' సినిమాకు సీక్వెల్ రెడీ అవుతుందా.. ?
Sunday,November 12,2017 - 12:01 by Z_CLU
‘లీడర్’ సినిమాతో దగ్గుబాటి ఫామిలీ నుంచి హీరోగా పరిచయమైన రానా త్వరలో ఈ సినిమా సీక్వెల్ తో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడనే టాక్ వినిపిస్తుంది .. లీడర్ తో నటుడిగా అందరి ప్రశంశలు అందుకున్న రానా. మరో సారి శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్క బోయే సినిమా లీడర్ కి సీక్వెల్ గా పొలిటికల్ డ్రామాగా రానుందని సమాచారం.
లేటెస్ట్ గా ‘ఫిదా’ తో సూపర్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని, రానా ఈ సినిమాలో మరో సారి సి.ఎం గా నటిస్తాడని వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.