డిటెక్టివ్ కార్తీక్.. ఈ నెల 21న విడుదల

Wednesday,July 12,2023 - 01:52 by Z_CLU

మర్డర్ మిస్టరీ నేపథ్యంతో డిటెక్టివ్ కార్తీక్, ఈ నెల 21న విడుదలమిస్టర్ అండ్ మిస్, ఓ స్త్రీ రేపు రా, మహానటులు వంటి చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అశోక్ రెడ్డి తాటిపర్తి రీడింగ్ ల్యాంప్ క్రియేషన్స్ పై నిర్మాతగా చేస్తున్న కొత్త సినిమా డిటెక్టివ్ కార్తీక్. ఈ చిత్రానికి వెంకట్ నరేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రజత్ రాఘవ్, గోల్డీ నిస్సీ, శ్రుతి మోల్, అనుష నూతల, మ్యాడీ, అభిలాష్ బండారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలకు సిద్ధమవుతోంది.

రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా నిర్మాత అశోక్ రెడ్డి తాటిపర్తి మాట్లాడుతూ – మర్డర్ మిస్టరీ కథతో ఈ చిత్రాన్ని నిర్మించాం. రిషిత అనే పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి కేసును ఇన్వెస్టిగేట్ చేసేందుకు సంధ్య అనే డిటెక్టివ్ వస్తుంది. ఆమె కూడా మిస్సింగ్ కావడంతో కార్తీక్ ఆ కేసును టేకప్ చేస్తాడు. ఈ క్రమంలో అతను ఊహించని ఎన్నో పరిణామాలను ఎదుర్కొ సంధ్యను ఎలా చేరుకున్నాడు అనేది కథాంశం. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమా ఉంటుంది. అన్నారు.