వరుణ్ తేజ 'ఫిదా' ట్రయిలర్

Friday,June 23,2017 - 06:28 by Z_CLU

వరుణ్ తేజ కొత్త సినిమా ముస్తాబైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ మెగా హీరో చేస్తున్న మూవీ ఫిదా. మొన్నటివరకు టీజర్ తో హల్ చల్ చేసిన ఈ మూవీ ట్రయిలర్ రిలీజైంది. శేఖర్ కమ్ముల మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది ట్రయిలర్ లో.

మలయాళీ బ్యూటీ సాయి పల్లవి, ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమవుతోంది. తొలి సినిమాకే తెలుగులో డబ్బింగ్ చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. చాన్నాళ్ల గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఓ ఎన్నారై అబ్బాయికి, తెలంగాణ అమ్మాయికి మధ్య నడిచే ప్రేమ కథగా తెరకెక్కుతోంది ఫిదా సినిమా. ఈ సినిమాకు శక్తికాంత్ సంగీతం అందించాడు. మూవీ విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తారు.