టాలీవుడ్ లో మరో ఇంట్రెస్టింగ్ కాంబో

Thursday,June 20,2019 - 02:45 by Z_CLU

చాలామంది ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా అక్కినేని అభిమానులు కోరుకున్న కాంబినేషన్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. నాగచైతన్య, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. ఈరోజు ఈ ప్రాజెక్టును అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

లవ్ స్టోరీస్ కు పెర్ ఫెక్ట్ గా ఫిట్ అవుతాడు చైతూ. అలాంటి స్టోరీల్ని తీయడంలో శేఖర్ కమ్ములది డిఫరెంట్ స్టయిల్. సో.. వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే అది ఓ రొమాంటిక్ క్లాసిక్ అవుతుందని చాలామంది ఫీలింగ్. అందుకే అక్కినేని ఫ్యాన్స్ ఈ కాంబో కోసం చాన్నాళ్లుగా ఎదురుచూశారు.

ఇలాంటి ప్రేమకథల్ని పండించాలంటే సాయిపల్లవి ది బెస్ట్ ఆప్షన్. సో.. ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇలా కమ్ముల దర్శకత్వంలో చైతూ-సాయిపల్లవి జంటగా మూవీ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూట్ కూడా స్టార్ట్ కాబోతోంది. మిగతా వివరాల్ని త్వరలోనే వెల్లడించబోతున్నారు.