కొత్త సినిమా స్టార్ట్ చేసిన శేఖర్ కమ్ముల

Monday,November 12,2018 - 02:58 by Z_CLU

సినిమా సినిమాకు మధ్య లాంగ్ గ్యాప్ తీసుకోవడం శేఖర్ కమ్ములకు కొత్తేంకాదు. ఈసారి కూడా ఈ దర్శకుడు అదే పనిచేశాడు. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్నాడు. ఎట్టకేలకు ఈ డైరక్టర్ తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈ రోజు ఉదయం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కొత్త సినిమా మొదలైంది.

రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాతో ఎప్పట్లానే కొత్త నటీనటుల్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు కమ్ముల. గతంలో కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, హ్యాపీ డేస్ సినిమాలతో చాలామంది నటీనటులు వెండితెరకు పరిచయయ్యారు.

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నారు. ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.