ఇంతకీ నాగచైతన్య అనుకున్నదేంటో..?

Wednesday,September 11,2019 - 11:57 by Z_CLU

శేఖర్ కమ్ముల సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది…? అసలీ సినిమాలో చై ఏం చేస్తుంటాడు…? ఈ క్వశ్చన్స్ కి క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఎగ్జాక్ట్ గా ఏం అవ్వాలనుకుంటాడో రివీల్ చేయలేదు కానీ, తన కలను నిజం చేసుకోవడానికి హైదరాబాద్ కి వచ్చే రెగ్యులర్ యంగ్ స్టర్ లా కనిపించబోతున్నాడట నాగచైతన్య.

ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. ఇంతకీ చై ఏం అవ్వాలనుకుంటాడు..? ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ, సినిమాలో సాయి పల్లవి  డ్యాన్సర్ గా కనిపించనుందనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఫుల్ ఫోకస్ నాగచైతన్య పై ఉంది. సినిమాలో చై కన్న కల ఏమై ఉంటుందోనన్న డిస్కర్షన్ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తుంది.

ఫస్ట్ టైమ్ శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటిస్తున్నాడు నాగచైతన్య. అందుకే ఫ్యాన్స్ లో రోజు రోజుకి ఈ సినిమా చుట్టూ క్యూరియాసిటీ పెరుగుతూనే ఉంది.  పవన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.