విజయ్ దేవర కొండ తో శేఖర్ కమ్ముల నెక్స్ట్ ?

Sunday,December 24,2017 - 12:09 by Z_CLU

ఇటీవలే ఫిదా తో దర్శకుడిగా గ్రాండ్ హిట్ అందుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల రానా తో ‘లీడర్ 2’ సినిమా చేయబోతున్నాడనే వార్త వినిపించగా ప్రస్తుతం ఈ డైరెక్టర్ నెక్స్ట్ లిస్ట్ లో మరో హీరో పేరు వినిపిస్తుంది. లేటెస్ట్ గా అర్జున్ రెడ్డి తో సెన్సేషనల్ హిట్ అందుకున్న విజయ్ దేవర కొండ తో శేఖర్ కమ్ముల ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని ఇప్పటికే విజయ్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేసాడనే టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమాతో విజయ్ సరసన రాజశేఖర్ కూతురు శివాని ను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నాడనే వార్త కూడా చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం విజయ్ దేవర కొండ దాదాపు 7 సినిమాలు సైన్ చేసాడని అందులో శేఖర్ కమ్ముల సినిమా కూడా ఉందని సమాచారం. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.