ఆ వార్తలో నిజంలేదన్న నాని

Sunday,February 18,2018 - 10:04 by Z_CLU

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం మేర్లపాక గాంధీతో ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా చేస్తున్న నాని ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ములతో ఓ సినిమా చేయబోతున్నడనే విషయం పై క్లారిటీ ఇచ్చేశాడు. ఇటివలే ఓ ఇంటర్వ్యూ లో శేఖర్ కమ్ముల గారితో సినిమా చేయబోతున్నారట కదా అని అడగగా.. అలాంటిదేం లేదని ఈ వార్త తను కూడా విన్నానని కానీ అందులో నిజం లేదని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం నాగార్జున గారితో కలిసి శ్రీరాం ఆదిత్య డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నానని, దాని తర్వాత హను రాఘవ పూడి పాటు విక్రం కె కుమార్ తో కూడా సినిమా చేయబోతునట్లు ప్రకటించాడు నాని. సో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాని సినిమా అంటూ వచ్చిన వార్త పుకారే అన్నమాట.