నాగచైతన్య-సాయిపల్లవి లవ్ స్టోరీ?

Thursday,October 31,2019 - 11:53 by Z_CLU

ప్రస్తుతం వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు లవ్ స్టోరీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇదొక అందమైన ప్రేమకథ అంటున్నాడు కమ్ముల. ఎన్నో టైటిల్స్ పరిశీలించి పైనల్ గా లవ్ స్టోరీ అనే టైటిల్ కే ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇందులో నాగచైతన్య తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నాడు. ఒకట్రెండ్ సన్నివేశాలు కాదు.. టోటల్ సినిమా మొత్తం ఇదే యాసలో మాట్లాడతాడు. దీనికోసం శేఖర్ కమ్ముల దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు ఈ హీరో.

ఈ మూవీతో ఏషియన్ సినిమాస్ సంస్థ నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది. డిసెంబర్ థర్డ్ వీక్ నాటికి సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ షూటింగ్ లేట్ అవుతోంది. అందుకే ఫిబ్రవరిలో లవ్ స్టోరీని థియేటర్లలోకి తీసుకొస్తారు.