ఉగాది కానుకగా చైతూ సినిమా?

Tuesday,December 03,2019 - 12:30 by Z_CLU

నాగచైతన్య-సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ క్యూట్ రొమాంటిక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి లవ్ స్టోరీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ డేట్ పై కూడా ఓ క్లారిటీకి వచ్చినట్టున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఉగాది కానుకగా ఏప్రిల్ 2న థియేటర్లలోకి వస్తోంది లవ్ స్టోరీ.

నిజానికి ఈ సినిమాను ఈ నెలాఖరుకే విడుదల చేస్తామని ప్రకటించాడు దర్శకుడు. కానీ టైమ్ సరిపోలేదు. దీంతో వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ లోనే ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఏప్రిల్ 2కు వెళ్లాలని అనుకుంటున్నారట. త్వరలోనే ఈ సినిమా టైటిల్, రిలీజ్ డేట్ పై అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.

ఏమిగోస్ క్రియేషన్స్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పవన్ సంగీత దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.