హలో గురు ప్రేమకోసమే

Tuesday,March 13,2018 - 04:33 by Z_CLU

నటీ నటులు : రామ్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, ప్రవీణ్ తదితరులు

ఛాయాగ్రహణం: విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

కథ -మాటలు-స్క్రీన్ ప్లే : ప్రసన్న కుమార్

దర్శకత్వం : త్రినాద్ రావు నక్కిన

ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ నిర్మాణంలో త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హలో గురు ప్రేమ కోసమే’.. సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ వంటి వ‌రుస విజ‌యాలు త‌ర్వాత త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో పాటు. రామ్ స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్ కీల‌కపాత్ర‌లో న‌టిస్తున్నారు. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఎన్నో సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు త‌న‌దైన సంగీతాన్ని అందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వ‌హిస్తున్నారు. విజ‌య్ కె.చ‌క్ర‌వ‌ర్తి సినిమాటోగ్ర‌ఫీ, సాహి సురేశ్ ఆర్ట్ వ‌ర్క్‌, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వ‌ర్క్ అందిస్తున్నారు. సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్ వంటి వ‌రుస విజ‌యాలు త‌ర్వాత త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో పాటు.. దిల్‌రాజు, రామ్‌ల ప‌వ‌ర్ ఫుల్ కాంబినేషన్ లో రూపొదుతున్న చిత్రం కానుండ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. బెజ‌వాడ ప్ర‌స‌న్న‌కుమార్ మాట‌లు.. ర‌చ‌న స‌హ‌కారం సాయికృష్ణ అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన మిగ‌తా వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

Release Date : 20181018

సంబంధిత వార్తలు