Vijay Deverakonda మా నాన్న ఫ్యామిలీ స్టార్

Monday,April 01,2024 - 04:50 by Z_CLU

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. “ఫ్యామిలీ స్టార్” సినిమా హైలైట్స్ ఈ కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – మనకు ఏ కష్టం వచ్చినా అండగా నిలబడి నేనున్నా అని ధైర్యం చెప్పే పర్సన్ ఫ్యామిలీలో ఒకరు ఉంటారు. ఆ ఒక్కరే ఫ్యామిలీ స్టార్. మా కుటుంబంలో మా నాన్న ఫ్యామిలీ స్టార్. డైరెక్టర్ పరశురామ్ ఈ కథ చెప్పినప్పుడు ఆయన లైఫ్ లోని అనుభవాలను ఊహించుకుంటూ చెప్పాడు. కథ వింటున్నప్పుడు మాత్రం నాకు మా నాన్న గుర్తొచ్చాడు. ఫ్యామిలీ కోసం ఆయన పడిన తపన గుర్తుకువచ్చింది. అందుకే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు గోవర్థన్ అనే పేరు పెట్టమని చెప్పాను. ఎందుకంటే ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఎమోషన్స్ పలికించడం సులువు అవుతుంది. ఆయన ఎలా ఫ్యామిలీ కోసం పనిచేసేవారో గుర్తుకువస్తుంటుంది. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతోంది. ఏప్రిల్ 8న నాన్న బర్త్ డే. ఈ సినిమా విషయంలో ఆయన గర్వపడతారని ఆశిస్తున్నా. ఏప్రిల్ 5న రాజు గారు దిల్ రాజు అయ్యారు. ఈ ఏప్రిల్ 5 డేట్ కూడా ఆయన కెరీర్ లో స్పెషల్ కావాలి.