దసరా పోటీ... రేస్ లో నాలుగు సినిమాలు

Sunday,June 03,2018 - 06:08 by Z_CLU

ప్రతీ ఏడాది సంక్రాంతికి ..దసరాకి కొన్ని తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడనున్న విషయం తెలిసిందే… ఈసారి కూడా దసరాకి కొన్ని సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఎన్టీఆర్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘అరవింద సమేత’ ఇప్పటికే దసరా బరిలో ముందుంది. ఈ సినిమాతో పాటు మరో మూడు సినిమాలు కూడా దసరా పోటీ లో నిలవనున్నాయి.

రవి తేజ, శ్రీను వైట కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ … శర్వానంద్ ‘పడి పడి లేచెమనసు’, రామ్ ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలు దసరాకే విడుదల కానున్నాయని సమాచారం. ఇంకా రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేయలేదు కానీ.. నిర్మాతలు దసరాకె ఈ మూడు సినిమాలను థియేటర్స్ కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సో ఈ దసరాకి ఈ నాలుగు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయన్నమాట.