టీజర్ టాక్... ఇంప్రెస్ చేసిన రామ్, అనుపమ

Monday,September 17,2018 - 05:18 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ లేటెస్ట్ మూవీ ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా టీజర్ రిలీజ్ అయింది. రామ్, అనుపమ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్ తో 39 సెకన్ల నిడివి గల ఈ టీజర్ యూత్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది.. సినిమాలో రామ్, అనుపమ మధ్య కెమిస్ట్రీ ని ఎలివేట్ చేస్తూ విడుదలైన ఈ టీజర్ ప్రస్తుతం అందరినీ ఇంప్రెస్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రినాద్ రావు నక్కిన దర్శకుడు. ప్రసన్న కుమార్ కథ-స్క్రీన్ ప్లే -మాటలు అందిస్తున్నాడు. ఇటివలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్స్ లోకి రానుంది.